Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేపాల్ నష్టం వివరాలివే!

నేపాల్ నష్టం వివరాలను ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపానికి అక్కడ 2,79,234 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 2,37,068 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలాగే, 7,757 మంది మృతిచెందగా, 16,390 మంది క్షతగాత్రులుగా మారారు. నిన్నటి వరకు దాదాపు 12 దేశాలకు చెందిన 600 సహాయక బృందాలు నేపాల్ నుంచి స్వదేశాలకు తరలివెళ్లిపోయాయని తెలిపారు. కాగా, భూకంప ధాటికి తీవ్రంగా నష్టపోయిన నేపాల్ మారుమూల ప్రాంతాలకు ఇంకా సహాయక చర్యలు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. నేపాల్ వ్యాప్తంగా సహాయక చర్యల్లో పోలీసులతో బాటు, ఆర్మీ కూడా పాలుపంచుకుంటోంది.

More Telugu News